Mon Dec 23 2024 10:31:33 GMT+0000 (Coordinated Universal Time)
రామోజీని కలిసిన రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలిశారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలిశారు. ఆయనతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు పూర్తి స్థాయి ప్రచారం ఇవ్వాలని వీరు రామోజీరావును కోరారు. పాదయాత్ర దేశ వ్యాప్తంగా జరుగుతుందని, మీడియా సహకారం కావాలని అభ్యర్థించారు.
మీడియా సంస్థల సహకారాన్ని...
దీంతో పాటు మీడియా సంస్థల అధినేతలందరినీ కాంగ్రెస్ నేతలు కలిసి రాహుల్ పాదయాత్రకు విశేష ప్రచారాన్ని కల్పించాలని కోరనున్నారు. ఈ నెల 23వ తేదీన రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించనుంది. అనంతరం దీపావళి పండగకు రెండు రోజులు పాదయాత్రకు రాహుల్ గాంధీ బ్రేక్ ఇవ్వనున్నారు.
Next Story