Sun Dec 22 2024 18:11:37 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ పాదయాత్రలో...?
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమయింది. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమయింది. మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా రేవంత్ పాదయాత్ర యాభై నియోజకవర్గాల్లో సాగనుంది. మొత్తం రెండు నెలల పాటు పర్యటించనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సాగే ఈ పాదయాత్రలో పలు ప్రజా సమస్యల గురించి రేవంత్ రెడ్డి తెలుసుకుంటారు. వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తూ ముందుకు వెళతారు. రోజుకు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.
తొలి రోజు సమావేశానికి...
ఎక్కడికక్కడ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు రామప్ప గ్రామంలో బస చేయనున్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేపట్టాలని పార్టీ ఆదేశించింది. రాహుల్ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్రలను చేపడుతున్నారు. రేవంత్ తొలి విడతగా యాభై నియోజకవర్గాల్లో చేయనున్నారు. తొలిరోజు యాత్రలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే మల్లురవి తదితరులు పాల్గొన్నారు.
Next Story