Thu Nov 28 2024 03:47:54 GMT+0000 (Coordinated Universal Time)
Congress : మైనారిటీ డిక్లరేషన్ ను విడుదల చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ ను విడుదల చేసింది. మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ డిక్లరేషన్ ను విడుదల చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ ను విడుదల చేసింది. మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ మైనారిటీ డిక్లరేషన్ ను విడుదల చేశారు. మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వక్ఫ్ భూములకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. గతంలో మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు. మైనారిటీల కోసం అనేక పథకాలను తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు.
అండగా నిలవాలని..
కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని రేవత్ రెడ్డి మైనారిటీ సోదరులను కోరారు. లౌకిక పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్, ఎంఐఎంకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ముస్లింల రక్షణకు పాటుపడేది కూడా ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. అందుకోసం కాంగ్రెస్ కు అండగా నిలవాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. పదేళ్ల పాటు అధికారమిచ్చిన పార్టీ ఏం చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు.
Next Story