కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై కాంగ్రెస్‌పై తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసి విడుదల చేసేందుకు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై కాంగ్రెస్‌పై తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసి విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ సెప్టెంబర్ మూడో వారంలో తొలి జాబితాను విడుదల చేసేందుకు ముమ్మరం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమై గత నెల 18 నుంచి 25 వరకు వచ్చిన 1006 దరఖాస్తులపై చర్చించింది. దరఖాస్తులు ఆహ్వానించిన తర్వాత సమావేశమైన కమిటీ, నియోజకవర్గాల వారీగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల వారీగా వేర్వేరు జాబితా..
ఇక అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా ఆర్జీలను వేరు చేసి, రిజర్వేషన్ నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను..రిజర్వేషన్ కానీ జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన వాటిని వేర్వేరుగా పరిశీలించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను కూడా నియోజకవర్గాల వారీగా వేరు చేసి కమిటీ పరిశీలించిందని తెలిపారు రేవంత్‌రెడ్డి. అయితే ఇందులో ఒక్కో ఫ్యామిలీలో రెండేసి టికెట్లు కావాలని డిమాండ్ చేస్తున్న వారితో కొంత తలనొప్పిగా ఉన్నా.. ఏదో విధంగా చేసి తొలిజాబితాను త్వరగా విడుదల చేసే పనిలో ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు ఈసారి పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొంటున్నారు. ఈ జాబితాపై ఢిల్లీ అధిష్టానం కూడా పరిశీలించి తుది జాబితాను తయారు చేయనుంది తెలంగాణ హస్తం పార్టీ.
ఈ అభ్యర్థుల పేర్ల ఖరారుపై పీఈసీ ఇచ్చే నివేదికపై సోమవారం నుంచి మూడు రోజుల పాటు పీఈసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్లతో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ విడివిడిగా చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1006 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. వీటన్నింటిని క్షణ్ణంగా పరిశీలించి ఎవరు కూడా అసంతృప్తి కాకుండా అందరిని సంతృప్తి పరిచేలా జాబితాను తయారు చేస్తున్నారు. మరి జాబితా విడుదల అయిన తర్వాత బీఆర్ఎస్లో జరిగినట్లే ఎవరు అసంతృప్తి చెందుతారో.. ఎవరు సంతృప్తి చెందుతారో వేచి చూడాలి.