Mon Dec 23 2024 12:53:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కాంగ్రెస్ నిరసన దీక్ష
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హతవేటుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు గాంధీభవన్ లో నిరసన దీక్ష చేపట్టనుంది
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు గాంధీభవన్ లో నిరసన దీక్ష చేపట్టనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ దీక్షను చేపట్టనుంది. ఈ దీక్షలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. గాంధీభవన్ లో జరగనున్న ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రానున్నారు.
రాహుల్పై అనర్హత వేటుకు...
ఇందుకోసం గాంధీభవన్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాహుల్ గాంధీపై మోదీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకూ దీక్ష చేపట్టనున్నారు. ఉదయం పది గంటలకు దీక్ష ప్రారంభం కానుంది. కాంగ్రెస్ నేతలందరూ తరలి వస్తుండటంతో గాంధీభవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story