Mon Dec 23 2024 11:56:53 GMT+0000 (Coordinated Universal Time)
సిద్ధరామయ్య, శివ కుమార్ లకు సన్మానం చేయాలనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణలోని బీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకోడానికి అన్ని పార్టీలు తమవంతు ప్రయత్నాలను చేస్తూ ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దగ్గరవడానికి కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది. అందులో ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి కారణమైన కాంగ్రెస్ ముఖ్య నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లను సన్మానించాలని భావిస్తూ ఉన్నారు. సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టగా.. శివ కుమార్ డెప్యూటీగా నియమితులయ్యారు. వీరిద్దరూ బీసీ నేతలే కావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటూ ఉన్నారు.
ప్రజల ముందు బహిరంగ సభలో వీరిని సన్మానించి కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఎంత ప్రాధాన్యత ఉందో కాంగ్రెస్ చాటిచెప్పాలని భావిస్తూ ఉంది. ఇద్దరు నేతల సన్మానం కాంగ్రెస్ను ముందుకు తీసుకెళ్లేందుకు వీలు కల్పిస్తుందని పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ కేడర్లో నైతిక స్థైర్యాన్ని పెంచాయని, రాజకీయ సమావేశాలు నిర్వహించడం వల్ల రాష్ట్రంలోని సామాన్యులు, ఇతర ఓటర్లలో ప్రభావం చూపుతుందని అన్నారు.
మరో వైపు కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు తెలంగాణలో ఎన్నికలపై ప్రభావం చూపబోవని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తూ ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ మాత్రం తమ బహిరంగ సభలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలను సమీకరించాలని యోచిస్తోంది. బీసీ నేతలకు కావాల్సిన పదవులు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలోని బీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకోడానికి అన్ని పార్టీలు తమవంతు ప్రయత్నాలను చేస్తూ ఉన్నాయి.
Next Story