Mon Dec 15 2025 00:12:38 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్, కిషన్ లు ఇద్దరూ ఒక్కటే: మల్లు భట్టి విక్రమార్క ఆరోపణలు
కేసీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరూ ఒకటేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

కేసీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరూ ఒకటేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ విషయం రాష్ట్రమంతటా తెలుసునని ఆయన అన్నారు. మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు బీజేపీ, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ కూడా అలాగే అనుకుంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను...
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల పథకాలను ప్రజలకు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్న మల్లు భట్టి విక్రమార్క విపక్షాల విమర్శలను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకు వెళతామని తెలిపారు.
Next Story

