Sun Mar 30 2025 04:18:42 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 7వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 7వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష జరగనుంది. మే 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష నిర్వహించనున్నారు.
వరస పరీక్షలు...
మే 18న ఎడ్సెట్ జరుగుతుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 25న లాసెట్ పీజీఎల్ సెట్ జరగనుంది. మే 26వ తేదీన ఐసెట్, మే 29వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ పీజీ ఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో పేర్కొంది.
Next Story