Tue Dec 17 2024 11:37:06 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రుణాలన్నీ మాఫీ చేసిన కేసీఆర్ సర్కార్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రైతులకు సంబంధించి రూ.1 లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం నాడు 10,79,721 మంది రైతులకు చెందిన రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసింది. ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఈ నెల 2న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ ఆగస్టు 3 నుంచి రైతుమాఫీని ప్రారంభించాలని ఆర్థికమంత్రి హరీశ్రావు, అధికారులను ఆదేశించారు. రుణమాఫీలో ప్రక్రియ 3న ప్రారంభం కాగా.. తొలిరోజు రూ.41వేల లోపు 62,758 మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. విడుదల వారీగా రైతుల రుణాలను మాఫీ చేస్తూ వచ్చిన ప్రభుత్వం మిగతా రైతుల రుణాలను సోమవారం ఒకేసారి రూ.99,999 లోపు ఉన్న 10.79లక్షల మంది రైతుల రూ.6,546.05కోట్లను మాఫీ చేసింది.
Next Story