Sun Dec 22 2024 21:46:09 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు జరగనున్నాయి. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు జరగనున్నాయి. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఉదయం గన్ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారీ గా ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో...
ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన వారిని గుర్తు చేసుకుంటారు. వారికి నివాళులర్పిస్తారు. పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. పరేడ్ గ్రౌండ్ లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం తాము ఈ ఆవిర్భావ వేడుకలకు హాజరు కామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
Next Story