Sun Dec 22 2024 21:51:47 GMT+0000 (Coordinated Universal Time)
వాహనదారులకు అలర్ట్.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు
ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కును పూర్తిగా మూసేస్తారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మొత్తం 3 వారాలపాటు ఉత్సవాలను నిర్వహించాలని ప్రణాళికలు రచించింది. ఉత్సవాలలో మొదటిరోజు.. నేడు సీఎం కేసీఆర్ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు పలు మార్గాల్లో వాహనాలను దారి మళ్లించారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కును పూర్తిగా మూసివేశారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సచివాలయం, గన్‌పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలున్నాయి. ఈ కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు కోరారు.
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం పరిసరాల్లో కూడా వాహనాలను కొద్దిసేపు నిలిపివేయనున్నారు. పంజాగుట్ట నుంచి రాజ్‌భవన్ వైపు, సోమాజిగూడ నుంచి వీవీ విగ్రహం వైపు, అయోధ్య నుంచి నిరంకారి, రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్ మినార్, ఇక్బాల్ మినార్ నుంచి ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి రవీంద్రభారతి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు, బీజేఆర్ విగ్రహం, నాంపల్లి వైపు నుంచి రవీంద్రభారతి, పీసీఆర్ జంక్షన్, బషీర్‌బాగ్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేయనున్నారు. ఆయా మార్గాలమీదుగా వెళ్లే వాహనదారులు ఈ రూల్స్ గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Next Story