Fri Nov 22 2024 23:47:43 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త వేరియంట్ పై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు ఇవే..
ప్రస్తుతం ఆందోళన పడాల్సిన అవసరం లేదు కానీ.. కరోనా జాగ్రత్తలను తీసుకోవాలని ప్రజలకు సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో..
కరోనా ఇప్పుడు BF7 వేరియంట్ రూపంలో ప్రపంచ దేశాలకు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. మళ్లీ కరోనా మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. గుంపులుగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచించింది. రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ వ్యాప్తిని ప్రారంభంలోనే గుర్తించి, అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ఎయిర్ పోర్టులో ప్రయాణికుల స్క్రీనింగ్ తో పాటు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఆందోళన పడాల్సిన అవసరం లేదు కానీ.. కరోనా జాగ్రత్తలను తీసుకోవాలని ప్రజలకు సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉందని తెలిపింది. నిన్న రాష్ట్రంలో 6 కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం 34 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోవిడ్ పాజిటివ్ గా తేలిన ప్రయాణికుల శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తున్నట్లు వివరించారు. చైనా, అమెరికా, జపాన్, దక్షిణకొరియా దేశాల్లో BF 7 వేరియంట్ కేసులు గణనీయంగా నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
Next Story