Mon Nov 18 2024 20:28:55 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : 17న సుప్రీంలో విచారణ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు ను తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. 17న ఈ కేసును విచారించనుంది
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు ను తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. సీబీఐ దర్యాప్తుపై స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు లో మెరిట్స్ ఉంటే హై కోర్టు తీర్పును రివర్స్ చేస్తామని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ఈ నెల 17 న విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఆరోజు విచారణ జరిపి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఒక స్పష్టత ఇవ్వనుంది.
హైకోర్టులోనూ...
అయితే ఈరోజు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ విచారించేందుకు అడ్వకేట్ జనరల్ అనుమతి కోరారు. సిట్ ఫైళ్లను ఇవ్వాలని సీబీఐ ఒత్తిడి చేస్తుందని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. మరోమారు సీఎస్‌కు సీబీఐ లేఖ రాసిందన్నారు. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ ముందుకు ఎలా వెళతారని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టుదే తుది నిర్ణయమన్న డివిజన్ బెంచ్ పేర్కొంది.
Next Story