Sat Dec 21 2024 08:13:45 GMT+0000 (Coordinated Universal Time)
విదేశాలకు చీఫ్ సెక్రటరీ... బాధ్యతలను?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. రేపటి నుంచి ఆయన ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండరు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అరవింద్ కుమార్ కు....
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కెన్యాకు బయలుదేరి ఈ నెల 2వ తేదీన వెళుతున్నారు. కెన్యా రాజధాని నైరోబీలో జరగనున్న ఇక్రిశాట్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం ఈ నెల 6వ తేదీన ఆయన తిరిగి బయలు దేరి వస్తారు. అప్పటి వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యవసర బాధ్యతలను అరవింద్ కుమార్ కు అప్పగించారు.
Next Story