Fri Dec 27 2024 17:49:21 GMT+0000 (Coordinated Universal Time)
BIG BREAKING : రెండురోజులు విద్యాసంస్థలకు సెలవులు
రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, అందుకు సంబంధించి..
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి (జులై26,27) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు విద్యాశాఖ రెండురోజుల పాటు సెలవులు ప్రకటించింది.
మరోవైపు రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Next Story