Mon Dec 23 2024 11:46:56 GMT+0000 (Coordinated Universal Time)
24నే దీపావళి సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
గతంలో విడుదల చేసిన సెలవుల జాబితాలో దీపావళి సెలవు తేదీని మారుస్తున్నట్టు తెలిపింది. అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించిన..
ఈ ఏడాది దీపావళిని ఏ రోజు జరుపుకోవాలన్న సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు. ఎందుకంటే అమావాస్య రెండ్రోజులు వచ్చింది. పైగా క్యాలెండర్ లో దీపావళి పండుగ ఇచ్చిన తేదీ రోజునే సూర్య గ్రహణం ఏర్పడుతుంది. దీంతో పండుగ వేడుకలపై అయోమయంలో ఉన్నారు జనాలు. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవును 25 నుండి 24కి మారుస్తూ.. ఉత్తర్వులు జారీ చేసి ప్రజల సందేహాలకు తెరదించింది. ఈ నెల 24న అంటే రాబోయే సోమవారాన్ని సెలవు దినంగా ప్రకటించింది.
గతంలో విడుదల చేసిన సెలవుల జాబితాలో దీపావళి సెలవు తేదీని మారుస్తున్నట్టు తెలిపింది. అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. పురోహితులు కూడా 24నే పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. 24వ తేదీ సాయంత్రం 4.25 గంటలకు అమావాస్య ప్రారంభమై.. 25వ తేదీ సాయంత్రం 4.25 గంటలకు అమావాస్య ముగిసి.. కార్తీక మాసం ఆరంభమవుతుంది. 24వ తేదీ సాయంత్రాన్నే అమావాస్యగా భావించాలని, ఆ రోజునే లక్ష్మీపూజ చేయాలని సూచిస్తున్నారు.
Next Story