Mon Dec 23 2024 08:50:47 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ ఉక్కుపై బీఆర్ఎస్ ఫోకస్
విశాఖ ఉక్కు కర్మాగారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది
విశాఖ ఉక్కు కర్మాగారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్లలో తెలంగాణ పాల్గొననుంది. తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఉక్కును సేకరించడం కోసం స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
కొనుగోలు చేసేందుకు...
ఇందుకోసం రెండు రోజుల్లో తెలంగాణ అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించనున్నారని సమాచారం. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ కూడా లేఖ రాశారు. ఏపీలో బలపడాలంటే సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొనుగోలు చేయడమే ఉత్తతమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం కసరత్తులు ప్రారంభించింది.
Next Story