Mon Dec 23 2024 06:28:55 GMT+0000 (Coordinated Universal Time)
రాకేష్ కుటుంబానికి 25 లక్షల సాయం
పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల ఎక్సగ్రేషియో ప్రకటించింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల ఎక్సగ్రేషియో ప్రకటించింది. రాకేష్ కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన పోలీస్ కాల్పుల్లో వరంగల్ కు చెందిన రాకేష్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లనే అగ్నిపథ్ ఒక యువకుడి ప్రాణాలను బలికొనిందని ఆయన అభిప్రాయపడ్డారు.
కుటుంబంలో ఉద్యోగం....
తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశసేవ చేయాలని రాకేష్ ఆర్మీలో చేరదామనుకున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా బలయ్యారని కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. హన్మకొండలో ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేష్ మృతదేహానికి నేడు వరంగల్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story