Mon Dec 23 2024 03:37:03 GMT+0000 (Coordinated Universal Time)
విద్యుత్తు కమిషన్ కొత్త ఛైర్మన్ గా జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్
విద్యుత్తు విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్ గా జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
విద్యుత్తు విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్ గా జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. లోకూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. గత ఛైర్మన్ ఎల్. నరసింహారెడ్డి స్థానంలో కొత్త ఛైర్మన్ ను నియమించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ విద్యుత్తు విచారణ కమిషన్ ఛైర్మన్ గా నియమించింది. ఛత్తీస్గడ్ తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో ఈ విచారణ కొనసాగనుంది.
విచారణను...
బీఆర్ఎస్ సభ్యుల డిమాండ్ మేరకే తాము విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతుంది. అయితే విచారణ కమిషన్ కేవలం కక్ష సాధింపు చర్యలో భాగమేనంటూ బీఆర్ఎస్ అంటోంది. ఈ విచారణను జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ మొదటి నుంచి ప్రారంభిస్తారా? లేక జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి చేసిన విచారణ దగ్గర నుంచి తన పని ప్రారంభిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే తాను విచారణ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరిస్తానని జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ తెలిపారు.
Next Story