Mon Dec 23 2024 05:02:31 GMT+0000 (Coordinated Universal Time)
8th Feb Optional Holiday in Telangana: రేపు స్కూళ్లు, కాలేజీల ఆప్షనల్ హాలిడే
తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలకు ఆప్షనల్ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
School and colleges Holiday: తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలకు ఆప్షనల్ హాలిడే ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు ఉద్యోగులకు కూడా ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది, ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్కు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు.
సాధారణ సెలవుగా....
ఫిబ్రవరి 8న సాధారణ సెలవుగా కాకుండా ఆప్షనల్ హాలిడేగా ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ పండుగ రోజును ముస్లింలు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. రాత్రంతా జాగారం చేస్తారు. అంతేకాదు ఆ రాత్రంతా వారు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం రేపు పాఠశాలలకు, కళాశాలలకు సెలవు దినంగా ప్రకటించింది.
Next Story