Mon Dec 23 2024 12:29:47 GMT+0000 (Coordinated Universal Time)
ఫాంహౌస్ ఎమ్మెల్యేలకు భద్రత పెంచిన ప్రభుత్వం
మొయినాబాద్ ఫాం హౌస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది
మొయినాబాద్ ఫాం హౌస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అందులో ఒక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావులకు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటివద్ద కూడా...
ఈ ముగ్గురు ఎమ్మెల్యేల ఇంటి వద్ద భద్రతను కూడా కల్పించింది. ఈ నలుగురి ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని భావించిన ప్రభుత్వం అందరికీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story