Mon Dec 23 2024 08:26:59 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం... ఆ బస్సుల్లోనేనా?
రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభం చేయబోతుంది. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీని ఆదేశించనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పింది. రేపు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఇచ్చిన హామీ మేరకు...
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు. అయితే కొన్ని సర్వీసులకే దీనికి పరిమితం చేస్తారా? గరుడ వంటి ఆధునిక బస్సు సర్వీసుల నుంచి దీనిని మినహాయిస్తారా? అన్నది ఇంకా తేలలేదు. నిన్న జరిగిన తొలి కేబినెట్ లోనూ దీనిపై చర్చించి రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణ హామీని అమలు పర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీకి ఆదేశాలు నేడు పంపనున్నారు. విధివిధానాలు కూడా నేడు ఆర్టీసీకి చేరనున్నాయి.
Next Story