Mon Dec 23 2024 12:45:11 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు ఎదురుదెబ్బ
పోడు భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
పోడు భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోడు భూముల విషయంలో తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన జీవో 140 పై హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను తేజావత్ శంకర్ నాయక్, ఎల్ అంజి, మీక్యా నాయక్ లు పిటీషన్ లు వేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
రాజ్యాంగానికి లోబడే...
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎమ్మెల్సీలతో వేసిన కమిటీ ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో చట్ట పరిధిలో లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని హైకోర్టు కోరింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేసింది
Next Story