Mon Dec 23 2024 06:39:04 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : అంగన్వాడీలకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్ వాడీలకు పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలను అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. అంగన్ వాడీ టీచర్ కు రెండు లక్షల రూపాయలు రిటైర్మ్మెంట్ బెనిఫిట్స్ అందుతాయని తెలిపారు. అంగన్ వాడీ హెల్పర్ కు రిటైర్ అయిన తర్వాత లక్ష రూపాయలు అందచేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
రెండు మూడు రోజుల్లో...
రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయని మంత్రి తెలిపారు. దీంతో అంగన్ వాడీ ఎన్నాళ్లగానో కోరుతున్న ఒక ప్రధాన మైన డిమాండ్ కు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లయింది. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంగీకారం తెలిపారని ఆమె చెప్పారు.
Next Story