Mon Dec 23 2024 10:03:36 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : జనవరి ఒకటోతేదీ సెలవును ప్రకటించిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త ఏడాది గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి ఒకటోతేదీ సెలవు దినంగా ప్రకటించింది
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త ఏడాది గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి ఒకటోతేదీ సెలవు దినంగా ప్రకటించింది. జనవరి ఒకటో తేదీన సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి వరకూ ఆటపాటలతో సరదాగా గడిపేందుకు వీలుగా జనవరి ఒకటోతేదీన హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండో శనివారం పనిదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది.
వేడుకలను నిర్వహించుకునేందుకు...
కొత్త ఏడాది వేడుకలను ఆనందోత్సాలతో జరుపుకునేందుకు వీలుగా ఈ హాలిడేను ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పార్టీలు చేసుకునే వారు పోలీసుల నిబంధనల మేరకు నడుచుకోవాలని, ఆరోజు బార్లు, మద్యం దుకాణాలు అర్థరాత్రి ఒంటి గంట వరకూ తెరచి ఉంచేందుకు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మద్యం తాగి వాహనాలు నడిపితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Next Story