Fri Apr 25 2025 21:08:59 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పిందంది. రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పిందంది. రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించింది. రైతు భరోసా నిధులను 90 శాతం మందికి ఇచ్చేందుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. రైతు బంధు నిధులను రెండు రోజుల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు.
విడతల వారీగా..
ఇప్పటికే కొందరి ఖాతాల్లో నిధులు జమ అయ్యాయన్న ఆయన ఈ రెండు మూడు రోజుల్లోనే 90 శాతం మంది రైతులకు నిధులు జమ చేస్తామని ఆయన చెప్పడంతో ఇక రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటి వరకూ ఎకరా భూమి నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. నిజంగా ఇది శుభవార్తగానే చూడాలి.
Next Story