Mon Dec 23 2024 13:55:49 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. 2.73 శాతం డీఏను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 జులై 1వ తేదీ నుంచి కొత్త డీఏ అమలు కానుందని ప్రభుత్వం పేర్కొంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది.
డీఏ కోసం...
ప్రభుత్వ ఉద్యోగులు డీఏ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి పలుమార్లు వినతులను సమర్పించారు. అయితే ఎన్నికల సంవత్సరం కావడంతో తెలంగాణ ప్రభుత్వం డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణలోని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు కూడా షెడ్యూల్ ను ప్రభుత్వం విడుడల చేసింది. ఈ నెల 27 నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలు కానుంది.
Next Story