Mon Dec 23 2024 03:43:09 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : గుడ్ న్యూస్ .. ఆర్టీసీలో 3,035 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో ఉన్న 3,035 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఆర్టీసీలో ఉన్న 3,035 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీజీఆర్టీసీలో పెద్దయెత్తున ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది.
దీర్ఘకాలంగా ఉన్న ...
ఇప్పటికే టీజీఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలును కూడా ప్రారంభించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కొత్త బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొనుగోలు చేసింది. తాజాగా పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పోస్టులకు అనుమతి లభించడంతో ఇక పోస్టులు దక్కించుకోవడంపై నిరుద్యోగులు దృష్టిపెట్టాల్సి ఉంది.
Next Story