Mon Dec 23 2024 08:31:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 7,094 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 7,094 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాఫ్ నర్సుల పోస్టులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో మొత్తం ఏడు వేలకు పైగానే పోస్టులు భర్తీ కానున్నాయి.
స్టాఫ్ నర్సుల పోస్టులకు...
కొత్తగా ఏర్పాటయిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వరస నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అందులో భాగంగానే తొలి విడతలో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంతో కాలంగా ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లే అనుకోవాలి.
Next Story