Sat Nov 23 2024 03:50:00 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై ఏడాదికి రెండుసార్లు
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై తెలంగాణలో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. టీచర్ ఎలిజిబిలుటీ టెస్ట్ రెండు సార్లు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రయత్నించే అభ్యర్థులకు కొంత వెసులుబాటును కల్పించింది. ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాలనుకుంటున్న వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో టెట్ పరీక్షను నిర్వహించాలని ్రభుత్వం నిర్ణయించింది.
ఎన్నిసార్లయినా రాసుకునేందుకు...
ఇందుకు సంబంధించిన విధివిధానాలను కూడా ఖరారు చేసింది. ఒక అభ్యర్థి ఎన్నిసార్లయినా టెట్ రాసుకునే వీలును కూడా కల్పించింది. టెట్ లో ఉత్తీర్ణత పొందిన వారు మాత్రమే డీఎస్సీ రాసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. టెట్ లో వచ్చే మార్కులను డీఎస్సీలో వెయిటీజీగా కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఒకసారి టెట్ రాసి స్కోరు పెంచుకోవడానికి మళ్లీ టెట్ రాసుకునే వీలు దీని ద్వారా కలుగుతుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం టెట్ ను రెండుసార్లు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యలంో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story