Mon Dec 23 2024 10:10:24 GMT+0000 (Coordinated Universal Time)
రేపు మునావర్ కామెడీ షో
మునావర్ ఫారుఖీ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేపు హైటెక్స్ లో మునావర్ కామెడీ షో జరగనుంది.
మునావర్ ఫారుఖీ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేపు హైటెక్స్ లో మునావర్ కామెడీ షో జరగనుంది. గతంలో ఈ కామెడీషోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆ కామెడీ షోకు అనుమతించ వద్దంటూ బీజేపీ నేతలు గతంలో హెచ్చరించారు. హిందూ దేవుళ్లను కించపర్చేలా మునావర్ షో లో వ్యాఖ్యలుంటాయని బీజేపీ నేతలు అంటున్నారు. గతంలో డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు.
బీజేపీ హెచ్చరిక...
అయితే బీజేపీ చేసిన అభ్యంతరాలను పోలీసులు తోసి పుచ్చారు. ప్రధానంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మునావర్ ఫారుఖీ కామెడీ షోకు అనుమతివ్వవద్దని ప్రభుత్వాన్నికోరారు. ఆ షోకు అనుమతిస్తే వేదికను తగులబెడతామని హెచ్చరించారు కూడా. అయితే ప్రభుత్వం ఈసారి కామెడీ షోకు అనుమతి ఇచ్చింది. రేపు షో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
Next Story