Wed Apr 16 2025 13:29:56 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్
ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల నియామకాల్లో వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల నియామకాల్లో వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దాదాపు 90 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ల ప్రక్రియ విడుదలకు కసరత్తులు ప్రారంభించింది.
వాటికి తప్పించి...
అయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసి విసిగిపోయి, వయోపరిమితి దాటిన వారికి చల్లటి వార్త చెప్పింది. గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపు రెండేళ్ల కాలం వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొంది. అయితే ఈ వయోపరిమితి సడలింపు పోలీసులు, ఫైర్ స్టేషన్, జైళ్లు, అటవీ శాఖ ఉద్యోగాలకు వర్తించదు. మిగిలిన అన్ని ఉద్యోగాలకు వర్తిస్తుంది.
Next Story