Mon Dec 23 2024 10:04:55 GMT+0000 (Coordinated Universal Time)
వీఆర్ఏలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
వీఆర్ఏలను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. పదిహేను మంది వీఆర్ఏ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించారు.
వీఆర్ఏలను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. పదిహేను మంది వీఆర్ఏ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించారు. అసెంబ్లీ కమిటీ హాలులో వీఆర్ఏ నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వారి డిమాండ్ల పై చర్చలు జరుపుతున్నారు. చాలా రోజుల నుంచి వీఆర్ఏలు ఆందోళనలు చేస్తున్నారు.
అసెంబ్లీ ముట్టడికి...
దశలవారీగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు తరలి వచ్చి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వీరిలో చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో వీఆర్ఏలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది.
Next Story