Mon Dec 23 2024 01:31:05 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రైతుభరోసా నిధులను విడుదల చేసిన ప్రభుత్వం.. కానీ వారికి మాత్రమే
రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడిన వారికి మాత్రమే నిధులను విడుదల చేసింది
రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడిన వారికి మాత్రమే నిధులను విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ త్వరలోనే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఇందుకు ఈ నెల 9వ తేదీ డెడ్ లైన్ గా పెట్టారు.
విపక్షాల విమర్శల నేపథ్యంలో...
అయితే ఈరోజు ఐదు ఎకరాల పైన ఉన్న వారికి మాత్రం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. రైతు భరోసా నిధుల విడుదల పై విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు రైతు భరోసా నిధుల విడుదల చేయకుండా రైతులకు ఈ ప్రభుత్వం నష్టం చేకూరుస్తుందని ఆరోపిస్తున్న తరుణంలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
Next Story