Mon Dec 23 2024 16:00:39 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine Crisis : ఉక్రెయిన్ లో విద్యార్థుల కోసం తెలంగాణ హెల్ప్ లైన్
తెలంగాణ ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం ఢిల్లీ, హైదరాబాద్ ల లోహెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, హైదరాబాద్ లో ఈ హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ కు రాత్రి నుంచి 75 ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు చెబుతున్నారు. జపోర్జియా యూనివర్సిటీలో పెద్దసంఖ్యతో తెలుగు విద్యార్థులు ఉన్నారని గుర్తించారు.
ఏమాత్రం అవకాశం ఉన్నా..
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అధికారులతో ఈ విషయంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులు బంకర్లలో తలదాచుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతానికి వారంతా క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు. వారిలో కొందరితో ఫోన్ లో మాట్లాడుతున్నామని, ఏమాత్రం అవకాశం చిక్కినా వారిని భారత్ కు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.
Next Story