Fri Nov 22 2024 21:40:11 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంద.ి ఇక పై రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ పథకం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య శ్రీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ - ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే సేవలన్నింటినీ ఆహార భద్రత కార్డుపై కూడా అమలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శ్రీ ట్రస్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరోగ్య భద్రత కార్డున్నా...
ఇప్పటి వరకూ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఆరోగ్య శ్రీ పథకం వర్తించేది. కానీ ఇప్పుడు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఆరోగ్య శ్రీ కార్డులను అంద చేశారు. తాజాగా రేషన్ కార్డు లేకపోయినా ఆహార భద్రత కార్డు ఉంటే చాలు ఆరోగ్య శ్రీ అమలు జరిగేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Next Story