Mon Dec 23 2024 09:57:22 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ట్రాఫిక్ చలాన్ల రాయితీ మరోసారి పొడిగింపు
పెండింగ్ చలాన్ల రాయితీని మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
పెండింగ్ చలాన్ల రాయితీని మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకూ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మూడు సార్లు పొడిగించిన ప్రభుత్వం చెల్లింపులకు సరైన స్పందన రాకపోవడంతో మరోసారి రాయితీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15వ తేదీలోగా పెండింగ్ చలాన్లను చెల్లించ వచ్చని కొత్తగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
పెండింగ్ చలాన్లను...
పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు నేటితో రాయితీ గడువు ముగియనుంది. తొలుత పదోతేదీవరకూ ఆఖరి గడువుగా నిర్ణయించినా, తర్వాత పదిహేనోతేదీకి పొడిగించింది. ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ వరకూ రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని తెలిపింది. ఈరోజు మరోసారి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story