Hyderabad : మూసీ ప్రాజెక్టు అటకెక్కిందా? పట్టాలెక్కుతుందా?
మూసీ నది ప్రక్షాళన చేపట్టాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేసింది
మూసీ ప్రాజెక్టు ఊసే ఈ మధ్య కాలంలో వినిపించడం లేదు. మూసీ నది ప్రక్షాళన చేపట్టాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేసింది. కొన్ని రోజులు జీహెచ్ఎంసీ అధికారులు హడావిడి చేశారు మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లకు నోటీసులు అందించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లేను ఖాళీ చేయించారు. వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించి అక్కడకు తరలించగలిగింది. ఇక ప్రాజెక్టు ఊపందుకుంటుందన్న సమయంలో కొద్ది రోజుల నుంచి ఆ ప్రాజెక్టు గురించి ఇటు అధికారులు కానీ, ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడంతో పాటు పూర్తి స్థాయిలో ఒకేసారి మూసీ నదీ పరివాహక ప్రాంతంలో నివాసాలను తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now