Sat Jan 11 2025 17:50:51 GMT+0000 (Coordinated Universal Time)
గవర్న vs సర్కార్.. ఇక హైకోర్టులో
రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం నేడు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి
రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం నేడు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. బడ్జెట్ శాసనసభ సమావేశాలు వచ్చే నెల మూడో తేదీన ప్రారంభం కానున్నయి. ఇంకా నాలుగు రోజులు సమయం కూడా లేదు. అయినా ఇంత వరకూ బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించకపోవడంతో హైకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
21న లేఖ పంపినా...
ఈ నెల 21వ తేదీన ప్రభుత్వం గవర్నర్ కు లేఖ పంపినా ఇంతవరకూ అనుమతి తెలపలేదు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని, అందుకు సంబంధించిన కాపీని తమకు పంపారా? లేదా? అని గవర్నర్ కార్యాలయం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ లేఖ అందించింది. ప్రభుత్వం మాత్రం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఇష్టంలేదు. దీంతో బడ్జెట్ ఆమోదం కోసం ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుందని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారన్ని బట్టి తెలుస్తోంది.
Next Story