Mon Dec 23 2024 20:10:10 GMT+0000 (Coordinated Universal Time)
2023లో తెలంగాణ ప్రభుత్వ సెలవుల లిస్ట్ ఇదే..
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పండుగల నిమిత్తం, స్పెషల్ లీవులు 23 నోటిఫైడ్ సెలవులున్నాయి. ఇవన్నీ కూడా వేతనంతో..
మరికొద్ది రోజుల్లో 2022 సంవత్సరం ముగిసి.. 2023 సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 2023లో సెలవుల జాబితాను విడుదల చేసింది. జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవులు, వేతనంతో కూడిన సెలవుల లిస్ట్ ను ప్రకటించింది. 2023లో మొత్తం 28 సాధారణ సెలవులు, 24 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవులతో పాటు.. అధికారుల అనుమతితో 5 ఆప్షనల్ హాలిడేస్ మాత్రమే ఉంటాయని పేర్కొంది.
అలాగే వాటితోపాటు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పండుగల నిమిత్తం, స్పెషల్ లీవులు 23 నోటిఫైడ్ సెలవులున్నాయి. ఇవన్నీ కూడా వేతనంతో కూడిన సెలవులుగా ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. 2023లో ఏప్రిల్ నెలలో అత్యధికంగా 16 రోజులు సెలవులొచ్చాయి. ఆదివారాలు, రెండో శనివారం కాకుండా.. ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి. ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 22న రంజాన్, ఏప్రిల్ 23న రంజాన్ సెలవులు ఇచ్చింది.
పెద్ద పండుగలైన భోగి, సంక్రాంతి, దీపావళి, రంజాన్ పండుగలు.. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో వచ్చాయి. న్యూ ఇయర్ ఆదివారం రోజు రాగా.. భోగి పండుగ రెండో శనివారం రోజు వచ్చింది. సంక్రాంతి పండుగ కూడా ఆదివారం రోజే వచ్చింది. దీపావళి పండుగ కూడా ఆదివారం రోజే వచ్చింది. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ అక్టోబర్ 10న వచ్చింది. విజయవదశమి సందర్భంగా అదే నెల 24న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. దీపావళి సెలవును నవంబర్ 12న ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 24 రోజుల ఆప్షనల్ హాలిడేస్ లో కనుమ, మహవీర్ జయంతి, బసవ జయంతి, వరలక్ష్మి వ్రతం, దుర్గాష్టమి, నరకచతుర్ధి తదితర పండుగలు ఉన్నాయి.
Next Story