Tue Mar 25 2025 05:13:28 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో కులగణన రీ సర్వే రేపటి నుంచి
తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి కులగణన కోసం ఇంటింటి సర్వే నిర్వహించనుంది

తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి కులగణన కోసం ఇంటింటి సర్వే నిర్వహించనుంది. సర్వేకు కొందరు దూరం కావడంతో పాటు మరికొందరు ఉద్దేశ్యపూర్వకంగానే వివరాలు చెప్పకుండా ఉండటంతో మరోసారి సర్వే నిర్వహించాలని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాల్గొనని వారి కోసం...
సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకూ మరోసారి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. మరోసారి సర్వేలో పాల్గొనేందుకు ప్రజలకు అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ఈసారి అయినా తమ వివరాలను సిబ్బందికి అందించాలని ప్రభుత్వం కోరింది.సర్వే తప్పుల తడకగా జరిగిందని, పూర్తి స్థాయిలో జరగలేదని విపక్షాలు ఆరోపించడంతో మరోసారి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.
Next Story