Mon Dec 23 2024 17:33:03 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు... కోవిడ్ ఎఫెక్ట్
తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. పొరుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తుండటంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. పొరుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తుండటంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. కర్ణాటక - తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టును ఏర్పాటు చేసి పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రధానంగా బీదర్ లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడ చెక్ పోస్టును ఏర్పాటు చేసింది.
బీదర్ లో కేసులు....
సనాగరెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం హస్సెల్లి గ్రామంలోనూ, జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి గ్రామ శివార్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రం నుంచి వస్తున్న వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. బీదర్ లో కేసులు పెరుగుతుండటంతో అక్కడ లాక్ డౌన్ కూడా విధించారు. రాత్రి, పగలు చెక్ పోస్టుల వద్ద నిఘా కొనసాగుతుంది. కోవిడ్ పాజిటివ్ వస్తేనే రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు.
Next Story