Tue Mar 18 2025 14:24:14 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్ఆర్ఎస్ పై తాజా అప్ డేట్ ఇదే
నేడు ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

నేడు ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ప్రభుత్వ భూమి, జలవనరుల సమీపంలోని ఉన్నవి మినహా మిగిలిన అన్ని లే అవుట్లలో ఎల్ఆర్ఎస్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది. అన్ని దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.
ఆ భూములకు మినహా...
ప్రభుత్వ భూమి, జలవనరుల సమీపంలో ఉన్న వాటికి మినహాయించి మిగిలిన దరఖాస్తులకు ఆటోమేటిక్ ఫీ జనరేషన్ ను ఏర్పాటు చేయనుంది. నేరుగా దరఖాస్తుదారులకు రుసుము సమాచారం ప్రభుత్వం అందచేసేలా చర్యలు తీసుకోనుంది. రెండురోజుల్లో సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. ఫీజు వసూళ్లపై సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులర్ జారీ అయినట్లు తెలిసింది.
Next Story