Fri Dec 20 2024 01:31:00 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లాల పర్యటన
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాల పర్యటన చేయనున్నారు
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాల పర్యటన చేయనున్నారు. ఈరోజు ఉదయం యాదాద్రికి వచ్చారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. గవర్నర్ గా నియమితులైన తర్వాత జిష్ణుదేవ్ వర్మ తొలిసారి జిల్లాల పర్యటనకు వస్తుండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు ఎక్కడకక్కడ స్వాగతం పలుకుతున్నారు.
మూడు రోజుల పాటు...
భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తర్వాత ములుగు జిల్లాకు బయలుదేరి వెళతారు. రచయితలు, కళాకారులతో సమావేశం కానున్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు గవర్నర్ పర్యటన కొనసాగుతుంది.
Next Story