Mon Dec 23 2024 05:18:37 GMT+0000 (Coordinated Universal Time)
వైశాలి కిడ్నాప్ పై గవర్నర్ ఏమన్నారంటే?
ఆదిభట్లలో డాక్టర్ వైశాలి కిడ్నాప్ సంఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ స్పందించారు
ఆదిభట్లలో డాక్టర్ వైశాలి కిడ్నాప్ సంఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ స్పందించారు. కిడ్నాప్ గురైన సంఘటనను తెలుసుకుని తాను షాక్ కు గురయ్యానని తమిళి సై ట్వీట్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి వెంటనే ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలని గవర్నర్ ఈ సందర్భంగా డీజీపీని కోరారు.
భద్రతతో పాటు...
వైశాలి కుటుంబానికి భద్రతతో పాటు భరోసా కల్పించాలని కోరారు. డాక్టర్ వైశాలి కిడ్నాప్ తెలంగాణలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. వంద మంది వరకూ వైశాలి ఇంటిపై దాడి చేయడం, పోలీసులు సకాలంలో స్పందించకపోవడంపైన కూడా పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. అయితే నవీన్ రెడ్డి మాత్రం తామిద్దరం పెళ్లి చేసుకున్నామని చెబుతున్నాడు.
Next Story