Mon Jan 13 2025 14:33:01 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పుపట్టిన గవర్నర్
ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఎన్నికల్లో ప్రచారం చేయడమేంటని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు
ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఎన్నికల్లో ప్రచారం చేయడమేంటని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. ఇలాంటి ప్రచారం చేసే వారిని ప్రోత్సహించకూడదని అన్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఇలాంటి ప్రచారాన్ని నిర్వహించారన్నారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే అందరరూ ఓటు వేయాలని ఆమె కోరారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రచారం చేసేటప్పుడు...
పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని గవర్నర్ తమిళి సై ప్రస్తావించారు. ఇలాంటి వాళ్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఓటు అనేది ప్రధాన ఆయుధమని, ఎవరూ ప్రజలపై వత్తిడి తేకూడదని అన్నారు. తాము గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పుకోవచ్చు కాని ప్రజలను బెదిరించడం సబబు కాదని తమిళిసై అభిప్రాయపడ్డారు.
Next Story