Mon Dec 23 2024 07:51:22 GMT+0000 (Coordinated Universal Time)
ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ చేసిన గవర్నర్ తమిళి సై
లంబోదరుడికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువుదీరారు.
వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కొలువుదీరిన పంచముఖి లక్ష్మీగణపతి తొలిపూజ అందుకున్నాడు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్ వినాయకుడికి తొలిపూజ నిర్వహించారు. ప్రజాసంక్షేమాన్ని కోరుకుంటూ గణనాధుడిని ప్రార్థించారు. అనంతరం పురోహితులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా.. ఖైరతాబాద్ లో తొలిసారి మట్టితో చేసిన బొజ్జ గణపయ్య విగ్రహం ఏర్పాటు చేశారు. పంచముఖ మహాలక్ష్మి రూపంలో ఉన్న ఈ ఖైరతాబాద్ గణేశ విగ్రహం ఎత్తు 50 అడుగులు.
లంబోదరుడికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువుదీరారు. ఉదయం పద్మశాలి సంఘం తరపున 50 అడుగుల జంధ్యం, కండువా, గరికమాల, పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ఈసారి స్వామివారి ప్రత్యేక పాదాలను ప్రధానవిగ్రహ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ భారీ విగ్రహం తయారీకి రూ.1.50 కోట్లు ఖర్చయినట్టు నిర్వాహకులు తెలిపారు. జూన్ 10 తేదీన విగ్రహ తయారీని మొదలు పెట్టగా.. విగ్రహ తయారీ పూర్తయ్యేందుకు సుమారు 2 నెలల 15 రోజుల సమయం పట్టినట్లు సమాచారం. విగ్రహ తయారీ కోసం ప్రత్యేకంగా ఒడిశా, చెన్నై ప్రాంతాల నుంచి సుమారు 100 మంది కార్మికులను పిలిపించారు.
Next Story