Mon Dec 23 2024 15:43:27 GMT+0000 (Coordinated Universal Time)
తమిళిసై అనూహ్య నిర్ణయం
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అసాధరణ నిర్ణయం తీసుకున్నారు. రిపబ్లిక్ డే వేడులకను రాజ్‌భవన్ లో జరపాలని నిర్ణయించారు
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అసాధరణ నిర్ణయం తీసుకున్నారు. రిపబ్లిక్ డే వేడులకను రాజ్‌భవన్ లోనే జరపాలని నిర్ణయించారు. ఉదయం పతాకావిష్కరణ, సాయంత్రం ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు ప్రభుత్వ అధికారులకు, పాలకులకు సమాచారం అందించారు. పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించకుండా రాజ్‌భవన్ లోనే నిర్వహించాలని నిర్ణయించారు.
రిపబ్లిక్ వేడుకలు...
గవర్నర్ తమిళి సై గత రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కూడా సొంతంగా తయారు చేసుకున్న స్క్రిప్ట్ నే ఆమె చదివారు. ఈసారి కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నర్ తాము తయారు చేసుకున్న ప్రసంగాన్నే ప్రజలకు వినిపించనున్నారు. గవర్నర్, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరగడంతో రాజ్‌భవన్ లో జరిగే ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ఎవరు హాజరవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story