Mon Dec 23 2024 11:46:51 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే హాజరుకాలేదు
కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్కు ప్రభుత్వానికి మధ్య వివాదానికి తెరపడలేదు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే గత నెల 30వ తేదీన తెలంగాణ సచివాలయం ప్రారంభం సందర్భంగా తాము గవర్నర్కు కూడా ఆహ్వానం పంపామని తెలంగాణ మంత్రులు మీడియాకు తెలియజేశారు.
ఆహ్వానం అందకనే...
అయితే మంత్రులు చెప్పినట్లుగా తనకు ఎటువంటి ఆహ్వానం అందలేదని, తనను ప్రారంభోత్సవానికి పిలవలేదని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. అసత్య ప్రచారం చేయడం తగదని ఆమె సూచించారు. ఆహ్వానం అందకపోవడం వల్లనే తాను ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story