Mon Dec 23 2024 06:59:47 GMT+0000 (Coordinated Universal Time)
రేపు కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న కారణంగా భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడంతో రోడ్లన్నీ జలమయం..
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న కారణంగా భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడంతో రోడ్లన్నీ జలమయం కావడమే కాకుండా వాగులు, నదులు, చెరువులు పొంగి పొర్లుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాతావరణ శాఖ ప్రజలెవరూ ఇంటి నుండి ఎట్టిపరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పోలీసులు అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు సహాయ చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు.
Next Story